Endukinta Prema Naapai - ఎందుకింత ప్రేమ నాపై

Admin

పల్లవి:
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ
అనుపల్లవి:
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

1. గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా?
గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా

2. నిరీక్షణే లేక... కలవరము చెందగా
అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు

3. ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న
ప్రేమతో నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక

Pallavi:
Israayelunu Kaapaaduvaadu Kunukadu Nidrapōḍu
Mammu Kaapaadina Maa Devaa – Idiyē Maa Jihvārpaṇa

Anupallavi:
Endukinta Prema Naapai Choopaavu Yesayya
Aayuvu Unnanta Varaku – Nee Stutine Pāḍedaa

1. Gothiloniki Digina... Mannu Ninnu Stutinchunaa?
Galametti Pādagalanaa... Mrutula Lōkaanaa?
Sajeevulu Sajeevulē Ninnu Stutiyinchedaru
Ee Kanṭhamu Moogabōkamundē Ārādhinchedaa

2. Nireekshaṇē Lēka... Kalavaramu Chendagaa
Aḍugulu Taḍabaḍagaa – Aaptulē Dūramainaa
Vaatsalya Kaṭākṣamulu – Entō Unnathamai
Goppa Kaaryamulu Naa Yedala Chesiyunnaavu

3. Innaalla Kainaa... Phalamulu Kaayakunna
Prema Tō Neevicchina... Vanarulē Vyarthamainaa
Ee Samvatsaramu Kooda Undanimmanee
Vijnaapanamu Cheyuchunna Pradhaana Yaajaka