Mellani Challani - మెల్లని చల్లని | M S Shanthavardhan

Admin

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
ఉల్లమంతటిని నింపు ఆనందము
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని||
శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
మంచిదంతటిని మాటతో చేసెను
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము ||మెల్లని||

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని||

గాలి తుఫానులన్ అణచిన స్వరమది
భీతి భయములన్ని బాపెడి స్వరమది
అంత్య దినమందున మృతుల లేపునుగా
అందరికి తీర్పును తీర్చి పాలించును ||మెల్లని||

మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని||

Mellani Challani Swaramu Yesayyade
Ullamanthatini Nimpu Aanandamu
Allakallolamu Baapi Shaanthi Nichchun ||Mellani||
Shoonyamu Nundi Sarvam – Srushti Chesenugaa
Manchidanthatini Maatatho Chesenu
Paapulanu Pilichina Prema Gala Swaramu
Paavanaparachedi Parishuddhuni Swaramu ||Mellani||

Swasthatha Shakthi Kaladu Prabhuni Swaramanduna
Deenulanu Aadarinchu Divya Karuna Swaram
Kullina Shavamunandu Jeevamunu Posenu
Punarutthaana Balam Kaladu Aa Swaramulo ||Mellani||

Gaali Thuphaanulan Anachina Swaramadi
Bheethi Bhayamulanni Baapedi Swaramadi
Anthya Dinamanduna Mruthula Lepunugaa
Andariki Theerpunu Theerchi Paalinchunu ||Mellani||

Mahima Gala Aa Swaram Piluchuchunde Ninnu
Mahima Naathundesu Koruchunde Ninnu
Mahima Gala Aa Swaram Vinedi Chevulunnavaa
Mahima Naathundesun Koru Hrudi Unnadaa ||Mellani||